మంచిర్యాల ప్రత్యక్షత:-రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్‌ స్థాయికి విస్తరించగా సోమవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో(ఆర్డిఓ) డివిజన్‌ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన అధికారి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై, ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రజా భవన్‌ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తుండగా, జిల్లా స్థాయి ప్రజావాణిని ప్రతి సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్‌ భవనంలో నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి నుండి రెవెన్యూ డివిజన్‌ స్థాయి ప్రజావాణిని ప్రతి సోమవారం సబ్‌ కలెక్టర్‌/రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని, దీనికి సబ్‌ కలెక్టర్‌/ఆర్డిఓ నోడల్‌ అధికారులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ నాయబ్ తహశీల్దార్ గడియారం శ్రీహరి, డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ ప్రసాద్, మంచిర్యాల మండల తహశీల్దార్ రహతుల్లా హుస్సేన్, డిఎల్పిఓ ధర్మారాణి, సంపత్, వివిధ శాఖల అధికారులు ప్రదీప్, శ్రావణ్ కుమార్, కిషోర్, ప్రశాంతి, చందులాల్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి