
మంచిర్యాల ప్రత్యక్షత:టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కుమార్తె డాక్టర్ గడియారం అక్షయ ఇటీవల ఎంబిబిఎస్ లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా గురువారం టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్షయ ను, ఆమె తండ్రి టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరిని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ, తన కుమార్తె ఎంబిబిఎస్ లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆమె ఇటువంటి మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వైద్యురాలిగా అక్షయ పేద వర్గాలకు ఉచిత సేవలు అందించడానికి ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, మాజీ కార్యదర్శి భూముల రామ్మోహన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు, అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
