-ఉత్తర తెలంగాణలో పేరుగాంచిన అంజనీపుత్ర ఎస్టేట్స్

-సామాజిక బాధ్యతగా సేవ కార్యక్రమాల నిర్వహణ

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల నమ్మకం, అభిమానంతో అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగారు. జిల్లాలో అనేక వెంచర్లు ప్రారంభించి, రియల్ ఎస్టేట్ రంగంలో తన ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. మధ్య తరగతి, ధనిక వర్గాల సొంత ఇంటి కలను నెరవేరుస్తూ, జిల్లాలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తనకంటూ ప్రస్థానాన్ని గణనీయంగా కొనసాగిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలోని మందమర్రి మండలం వెంకటాపూర్ లేమూరు గ్రామంలో అంజనీపుత్ర యాజమాన్యం అనుబంధ సంస్థ ఎవర ఎస్కేప్స్ పేరుతో నూతనంగా వెంచర్ను ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో అనేక వెంచర్లను ప్రారంభించి, విజయవంతంగా విక్రయాలు నిర్వహించిన అంజనీ పుత్ర యాజమాన్యం వెంకటాపురం లేమూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్లో సైతం వినియోగదారుల ఆదరాభిమానాలు చొరగొంటుందని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వివిధ ప్రాంతాలలో వ్యాపారం కొనసాగిస్తూ, ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని పొందిన అంజనీ పుత్ర సంస్థ తన సుదీర్ఘ ప్రయాణంలో ఈ నూతన వెంచర్ తో మరో కొత్త మైలు రాయిని సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా నమ్మకమైన సంస్థగా జిల్లా తోపాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అంజనీపుత్ర సంస్థకు బలమైన వినియోగదారుల మద్దతు కలదు. ప్రజల విశ్వాసం, వినియోగదారుల నమ్మకం, డైరెక్టర్ల కృషి ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తర తెలంగాణలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రథమ స్థానంలో కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంజనీ పుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, ఇతర డైరెక్టర్లు, సిబ్బంది సమిష్టి కృషితో ప్రజల ఆదరాభిమానాలు, వినియోగదారుల నమ్మకంతో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకోవడం విశేషం.

-సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాల నిర్వహణ

అంజనీ పుత్ర సంస్థ రియల్ ఎస్టేట్ రంగం తోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. జిల్లాలో ఏ కార్యక్రమం నిర్వహించిన అంజనీపుత్ర వైపు ప్రజలు చూస్తుంటారు. ఏ కార్యక్రమానికైనా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వివిధ కార్యక్రమాలకు సహాయం అందజేసి, వారి మనుగడను తోడ్పాటు అందిస్తూ, ప్రజల నమ్మకాన్ని, నెరవేరుస్తున్నారు. ఎంతోమంది క్రీడాకారులకు, కళాకారులకు చేయూతనందించడంలో అంజనీపుత్ర యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటు వస్తుంది. అనేక సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడ కార్యక్రమాల్లో అంజనీపుత్ర యాజమాన్యం సామాజిక బాధ్యతగా సహాయం అందజేస్తున్నారు. అదే పరంపరను కొనసాగిస్తూ, అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ దిగ్గజ రియల్ ఎస్టేట్స్ సంస్థగా ఉత్తర తెలంగాణ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి, తనతో పాటు పలువురికి ఉపాధి కల్పించడంతోపాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరో దిగ్గజ సంస్థగా ఎదుగుతుందని మార్కెట్ వర్గాలు ధీమాగా తెలుపుతున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి