
మంచిర్యాల ప్రత్యక్షత:-టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి-పల్లవి దంపతుల కుమార్తె డాక్టర్ గడియారం అక్షయ గోల్డ్ మెడల్ సాధించింది. శుక్రవారం హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అక్షయ ఎంబిబిఎస్ పట్టాను, గోల్డ్ మెడల్ ను అందుకుంది. ఈసందర్భంగా ఆమె తండ్రి టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఎంబిబిఎస్ లో తన కుమార్తె అక్షయ గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషం ఉందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకుంటూ, వైద్యురాలుగా బీద ప్రజలకు ఉచిత సేవలు అందించేందుకు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గడియారం అక్షయ ను ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.
