-కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన,

-జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రెటరీ జనరల్ వనజ రెడ్డి,

మంచిర్యాల ప్రత్యక్షత:-రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్‌ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజ రెడ్డి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌ వద్ద భారీ ఎత్తున నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ నాన్ గెజిటెడ్,గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక పెన్షనర్లు పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అలాగే ఉద్యోగుల రెండో పీఆర్సి ని హెల్త్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని 13 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి కోరారు. పాత పెన్షన్ విధానాన్ని యథావిధిగా అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ కో- చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, భూముల రామ్మోహన్, శ్రావణ్ కుమార్, నాగుల గోపాల్, చక్రపాణి, శ్రీనివాసరావు,వేణుగోపాల్, సుమిత్, రమేష్,సునీత, దుర్గా ప్రసాద్, వైస్ చైర్మన్ లు రాజా,వేణు, మనోజ్,జయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి