
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ కమిటీని రద్దు చేయడం జరిగిందని ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎరుకల బుచ్చిబాబు లు తెలిపారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ప్రెస్ క్లబ్ పాత కమిటీని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, క్లబ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ, పాత కమిటీని రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో మరల సర్వసభ్య సమావేశం నిర్వహించి, సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం కాలంగా క్లబ్ కు సహకరించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ, కుల, ప్రజా సంఘాల నాయకులకు, స్వచ్ఛంద, యువజన సంఘాల సభ్యులకు, పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎర్రవెల్లి శ్రీనివాస్, సాయి కుమార్, కూరపాటి శ్రీనివాస్, వేల్పుల కిరణ్, పిల్లి రవికిరణ్, డొలకల సంతోష్ కుమార్, గంజి సతీష్, బద్రి సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు.