మంచిర్యాల ప్రత్యక్షత:-టిజిఈజేఏసి రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న నిర్వహించు భోజన విరామ నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చి సహకరించాల్సిందిగా టిజిఈజేఏసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, కో చైర్మన్ వనజా రెడ్డి లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను కోరారు. ఈ మేరకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో బుధవారం టీజిఈజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీహరి, వనజా రెడ్డి లు మాట్లాడుతూ, ఏప్రిల్ 17న కలెక్టరేట్ ఆవరణంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలు తో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని జేఏసీ నాయకులు తమ పరిధిలోని మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాలలోని ఉద్యోగులతో గురువారం సన్నాహాక సమావేశం నిర్వహించి, 17న జరగబోయే నిరసన కార్యక్రమాన్ని ప్రతినిధులు నియమించాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండల, డివిజన్ స్థాయిలోను ఉద్యోగులను సమన్వయం చేసుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి, జిల్లాలో జరిగే భోజన విరామ సమయ ధర్నాకు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొడ్డు శ్రావణ్, శ్రీనివాస్ రావు దేశ్ పాండే, కుమార్, వేణుగోపాల్, రవి, సంజీవ్, గంగాధర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, తిరుపతి, రామ్ కుమార్, నాగుల గోపాల్, అజయ్ ప్రశాంత్, ప్రభు, పద్మజా, బుచ్చన్న, సత్యేంద్ర లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి