మంచిర్యాల ప్రత్యక్షత:-ఇటీవల టీఎన్జీవో జిల్లా కార్యదర్శిగా నియమితులైన బొడ్డు శ్రావణ్ కుమార్ ను టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో గల టీఎన్జీవో భవనంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ ను జిల్లా కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో టిఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, మాజీ కార్యదర్శి భూముల రామ్మోహన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు, అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి