మంచిర్యాల ప్రత్యక్షత:- మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతినీ పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ఐడిఓసి కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభలో ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, విశిష్ఠ అతిధులుగా బిసి సంక్షేమ శాఖ అధికారి భాగ్యవతి, టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు పాల్గొని మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఈ జయంతి సభలో టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టీఎన్జీవో ఉపాధ్యక్షులు కేజియా రాణి, రాంకుమార్, తిరుపతి మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి