-రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్, ఎస్ ఎం హుస్సేన్ ముజీబ్
-మంచిర్యాల టిఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభాకాంక్షలు

మంచిర్యాల ప్రత్యక్షత:- రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులుగా మారం జగదీశ్వర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ ముజీబ్ కి హైదరాబాద్ నాంపల్లి రాష్ట్ర టీఎన్జీవో భవన కార్యాలయంలో మంచిర్యాల టీఎన్టీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా టిఎన్జీవో తరఫున శాలువాతో సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గడియారం శ్రీహరి, కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి పలు ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. మారం జగశ్వర్ స్పందిస్తూ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సమస్యల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే టిఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ కార్యదర్శి భూముల రామ్మోహన్ సేవలను గుర్తు చేస్తూ సన్మానించారు.టీఎన్జీవో మంచిర్యాల జిల్లాలో ఏర్పడిన క్యాజువల్ వేకెన్సీలు కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ అధ్యక్షతన కో ఆప్షన్ పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీ మెషిన్ అహ్మద్, స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారిని కేంద్ర సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కేంద్ర సంఘం కార్యదర్శి అసోసియేట్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరి సురేష్ బాబు, ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు సంద అశోక్, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, నరేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ ప్రశాంత్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, లక్షెట్టిపేట యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాస్, చెన్నూర్ యూనిట్ అధ్యక్షులు వేణు, కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
