హోమ్ టాప్ న్యూస్ అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

0
12

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు.వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ నిర్ణీత వేగ పరిమితిలో వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటి ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా ఉంటుందని వివరించారు.యువత బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతపై తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి