హోమ్టాప్ న్యూస్టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోకకల్యాణార్థం గణపతి హోమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి అరుణ యోగేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం గణపతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. వేతన సవరణ, పెండింగ్ కరువు భత్యాలు, పాత పింఛను విధానం, ఆరోగ్య పథకం, పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కారం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కస్తూరి నాగేశ్వర్, హబీబ్ హుస్సేన్, సైండ్ల మొండయ్య, పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, బొడ్డు శ్రావణ్ కుమార్ తదితరులతో పాటు కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Latest articles

గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ గణేష్ నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో...

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో...

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం...

సిద్ధి వినాయకుడి సన్నిధిలో నాలుగో రోజు మహా అన్నదానం

-భక్తిశ్రద్ధలతో పూజలు.. దాతలకు ఘన సన్మానం మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి...

More like this