హోమ్టాప్ న్యూస్ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్‌ వేతన సవరణ, కరువు భత్యం, బకాయిల చెల్లింపులతో పాటు సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, సమర్థవంతమైన ఈహెచ్‌ఎస్‌ విధానం తీసుకురావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్‌కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, తిరుపతి, రామ్‌కుమార్, సత్యనారాయణ, నరేందర్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోకకల్యాణార్థం గణపతి...

గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ గణేష్ నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో...

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం...

సిద్ధి వినాయకుడి సన్నిధిలో నాలుగో రోజు మహా అన్నదానం

-భక్తిశ్రద్ధలతో పూజలు.. దాతలకు ఘన సన్మానం మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి...

More like this