హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో భవనంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

టీఎన్జీవో భవనంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

0
15

మంచిర్యాల ప్రత్యక్షత:-జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం టీఎన్జీవో భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాలు, దేశభక్తి, క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు తిరుపతి, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, మంచిర్యాల యూనియన్ ఉపాధ్యక్షుడు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి