
మంచిర్యాల ప్రత్యక్షత:-ఎంప్లాయిమెంట్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ ఉపాధ్యక్షులు యతిపతి రమేష్ బాబు, ఆయన సతీమణిని టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీఎన్జీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు సంద అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగిగా, టీఎన్జీవో నాయకుడిగా రమేష్ బాబు అందించిన సేవలు అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబంతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హబీబ్ హుస్సేన్, పుప్పాల హనుమంతరావు, బొడ్డు శ్రావణ్ కుమార్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, సతీష్ కుమార్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.