
మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ దుర్గాప్రసాద్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పాల్గొని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మంచిర్యాల బైపాస్ చౌరస్తాలో బాపూజీ విగ్రహ ఏర్పాటుకు టీఎన్జీవో తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు శ్రీపతి బాపురావు, కేజీయా రాణి, సత్యనారాయణ, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

