-భక్తిశ్రద్ధలతో పూజలు.. దాతలకు ఘన సన్మానం

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి, ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు పొన్న స్వప్న–మల్లయ్య దంపతులు, హనుమాండ్ల విమల–రాఘవరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు.ఈ సందర్భంగా స్వప్న–మల్లయ్య దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన పట్టు శాలువాను స్వామివారికి సమర్పించారు.టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ దాతల సహకారంతో మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి శ్రీనివాసరావు దేశ్పాండే, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీపతి మంజుల–బాపురావు దంపతులను ఘనంగా సన్మానించారు. అన్నదాన దాతలు పొన్న స్వప్న–మల్లయ్య, హనుమాండ్ల విమల–రాఘవరెడ్డి దంపతులను కూడా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు గుండేటి యోగేశ్వర్, కస్తూరి నాగేశ్వర్, నాయకులు పుప్పాల హనుమంతరావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సతీష్ కుమార్, తిరుపతిరెడ్డి, సునీత, ఎన్. సత్యనారాయణ, టి. తిరుపతి, రాంకుమార్, రాజేందర్, బెక్కం ఉషన్న తదితరులు, మహిళలు పాల్గొన్నారు.

