-టీఎన్జీవో భవనంలో జెండా ఆవిష్కరించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రభుత్వం ముందుకు సాగాలని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్‌కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, కే.శ్రీనివాస్, టి.తిరుపతి, జె.రామ్‌కుమార్, ఎన్.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, రోశయ్య, మంచిర్యాల యూనిట్ ఉపాధ్యక్షుడు ప్రకాష్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

