
మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్లో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక బంకమట్టి మహాగణపతిని వైభవంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బంకమట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. బంకమట్టి విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేసినా నీటికి పెద్దగా హాని కలగదని తెలిపారు.ప్రకృతి మిత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, పూజా కార్యక్రమాల్లో స్టీల్ పాత్రలు, ఆకుదొప్పలు వంటి పర్యావరణహిత వస్తువులను వినియోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి, సునీత, లక్ష్మీ రాజయ్య, మల్లికార్జున్, తిరుపతి, ఎన్.సత్యనారాయణతో పాటు కాలనీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

