
మంచిర్యాల ప్రత్యక్షత:-వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలతో చెరువులు, నదులు కలుషితమవుతున్నందున పర్యావరణహితమైన మట్టి గణపతులను పూజించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ, తిరుపతి, రామ్ కుమార్, నరేందర్, సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

