రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు క్యాతనపల్లి పట్టణంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వార్డులో ఎవరు గెలుస్తారో చర్చ పట్టణ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ప్రచారం చివరి రోజైన సోమవారం వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్వతి విజయ, బిఆర్ఎస్, సీపిఐ ఉమ్మడి అభ్యర్థి అయిన జక్కనబోయిన మంజుల కుమార్ లు తమదైన శైలిలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్వతి విజయ బోనాలు, బతుకమ్మలతో వార్డులో విస్తృతంగా పర్యటించి, తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా పట్టణ బిఆర్ఎస్ నాయకుడు అబ్దుల్ అజీజ్, వార్డు ఇంచార్జ్ మంద తిరుమల్ రెడ్డి లు ప్రచారంలో పాల్గొని, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే, బిఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు చేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, జరిగే అభివృద్ధి పనులను వివరించారు.అదేవిధంగా బిఆర్ఎస్ సిపిఐ అభ్యర్థి జక్కనబోయిన మంజుల కుమార్ సైతం తనదైన శైలిలో వార్డులో విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే, వార్డు అభివృద్ధి తోపాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, నిస్వార్థ సేవలు అందిస్తానన్నారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి, అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి