-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యేను పరామర్శించి నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలని టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి కోరారు. అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆయన సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులకు 17 శాతం హెచ్ఆర్ఏ అందించాలని ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లతో చర్చించి అతి త్వరలో హెచ్ఆర్ఏ ను అందించడానికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే తొందర్లో 17 శాతం హెచ్ఆర్ఏలు రావడానికి నా సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేకు మంచిర్యాల జిల్లా టీఎన్జీవో సభ్యులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన, టిఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ ,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.