హోమ్టాప్ న్యూస్సిద్ధి వినాయక సన్నిధిలో మహా అన్నదానం

సిద్ధి వినాయక సన్నిధిలో మహా అన్నదానం

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద గురువారం మూడో రోజు మహా అన్నదానం నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, టీజేఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరిపై శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ, 6 డీఏ, ఓపీఎస్, ఈహెచ్ఎస్, పెండింగ్ బిల్లులు త్వరగా మంజూరు కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా దాతల సహకారంతో ప్రతిరోజూ మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ సభ్యులు గడియారం శ్రీహరి దంపతులను, టీజీఈజేఏసీ జిల్లా కార్యదర్శి జనరల్ వనజా రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాచకొండ గోపాలరావు, సుదమల్ల హరికృష్ణతో పాటు హౌసింగ్ సొసైటీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోకకల్యాణార్థం గణపతి...

గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ గణేష్ నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో...

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో...

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం...

More like this