-ఏరియా జిఎం కి వినతి పత్రం అందజేసిన ఐఎన్టీయూసీ నాయకులు

మందమర్రి ప్రత్యక్షత:-సర్పంచ్ ఎన్నికల్లో విధులను నిర్వహించబోయే సింగరేణి ఉద్యోగులకు స్పెషల్ ఎలక్షన్ లీవ్ లకు బదులు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఐఎన్టీయూసీ నాయకులు మందమర్రి ఏరియా జిఎం కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐఎన్టియుసి ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య మాట్లాడుతూ స్పెషల్ ఎలక్షన్ లీవ్ ఇవ్వడం వలన సింగరేణి ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని స్పెషల్ ఎలక్షన్ లీవ్ కు బదులు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పిస్తే ఓడి మాస్టర్లు సంవత్సర మాస్టర్లలో కలుపుతారని అన్నారు. దానివలన అలవేన్సులు ఎక్కువ రావడమే కాక ప్లే డే సౌకర్యం కూడా లభించే అవకాశం ఉన్నదని ప్రోత్సాహకాలు అంతర్గత అసెస్‌మెంట్ మార్కులకు లెక్కించబడతాయని, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న సింగరేణి ఉద్యోగులకు ఈ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కనీసం సర్పంచ్ ఎన్నికల్లోనైనా వారికి తగు న్యాయం చేయాలని యజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, జాయింట్ సెక్రెటరీ జగన్నాధ చారి తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి