మంచిర్యాల ప్రత్యక్షత:-రాబోయే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సర్ సర్వేని సమర్థవంతంగా నిర్వహించాలని నస్పూర్ మండల తహశీల్దార్ సంతోష్ కుమార్, మంచిర్యాల అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ గడియారం శ్రీహరి లు తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సింగరేణి గెస్ట్ హౌస్ లో నస్పూర్, మంచిర్యాల మండలానికి సంబంధించిన బిఎల్ఓ లకు నస్పూర్ తహశీల్దార్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రేైనర్ గడియారం శ్రీహరి హాజరై, బిఎల్ఓ లకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రాబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ సర్వేను ఏ విధంగా నిర్వహించాలని బిఎల్ఓ లకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మండల నాయబ్ తహశీల్దార్ హరిత, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ కుమార్, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి