-చిత్రపటానికి నివాళులర్పించిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) పి చంద్రయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి భాగ్యవతి మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి,కార్యవర్గ సభ్యులు మోసిన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి