-మంచిర్యాల టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-ఎస్సీ బాలుర వసతిగృహం వార్డెన్ ను వేధింపులకు గురిచేసిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి మంచిర్యాల టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి వినతి పత్రం అందజేశారు. లక్షేట్టిపేట ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్ హాస్టల్ పిల్లల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన బిల్లులను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా వ్యక్తిగతంగా అవమానపరస్తూ తీవ్రంగా మనోవేదనకు గురి చేసిన అధికారి వేధింపులు తట్టుకోలేక శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హాస్టల్ వార్డెన్ రాజగోపాల్ కు తక్షణమే న్యాయం చేయాలని బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన టీన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి తెలిపారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. జిల్లా టీఎన్జీవో యూనిట్ నాయకులు టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కలెక్టర్ కు పూల మొక్క అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ విషయంపై వసతి గృహాల సంక్షేమ అధికారులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించుటకు సహకరించాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఉపసంచాలకులు దుర్గా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ మంచిర్యాల జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, జాయింట్ సెక్రటరీ సురేందర్, పబ్లిక్ సెక్రటరీ యూసుఫ్,రాజేందర్,మంచిర్యాల యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, అజయ్ ప్రశాంత్, విజయ, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ సభ్యులు గంగారం, సంజీత్ రావు, జిల్లా వసతి గృహాలు సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు మోహ్సిన్, కార్యవర్గ సభ్యులు ధర్మానంద్ గౌడ్, కుమార్, సునీత, కిషోర్, సుభద్ర, సుధాలక్మి, జయ శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.