-పలు సమస్యలపై మాట్లాడిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-నాంపల్లి టీఎన్జీవో భవనంలో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూములు రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలో టిఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిసెంబర్ నెలలో పూర్తి చేస్తామని అన్నారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్య అయినా సెప్టెంబర్ ఒకటోవ తారీకున కాకుండా కార్యచరణ ప్రకటించి పాత పెన్షన్ విధానాన్ని ప్రణాళిక ను తయారు చేయాలని అన్నారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏలను వెంటనే ఇప్పించాలని కోరారు. జిల్లా టిఎన్జీవో హౌసింగ్ సొసైటీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే విధంగా రెవెన్యూ శాఖకు సిసిఎల్ఏ లతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.అలాగే పలు సమస్యల పైన కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి మంచిర్యాల టిఎన్జీవో నాయకులు వినతి పత్రం అందజేశారు.