
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో గురువారం రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోసిన్ అహ్మద్ ఆధ్వర్యంలో సంఘం నూతన సంవత్సరం 2026 క్యాలెండర్, డైరీ నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై, సంఘం నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, విధి నిర్వహణలో వసతి గృహ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.టీఎన్జీవో సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, టిహెచ్డబ్ల్యుఓ కార్యదర్శి కే శ్రీనివాస్, కార్యవర్గం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.