-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కి వినతి పత్రం

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న టైపిస్ట్,కంప్యూటర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి కి వినతి పత్రం అందజేశారు. గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో 632 మంది టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు, రెవెన్యూ శాఖలో ప్రభుత్వ నిర్వహించే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం కష్టపడుతున్నారు . 2009 నుండి 2023 వరకు నిర్వహించిన సర్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. LRUP 2017 ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రాజెక్ట్ అమలు పరచడంలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లు నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని వారు కోరారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్స్ కు తగిన న్యాయం జరిగే విధంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిలతో చర్చించే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్,అనిత,రవి, షారూక్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి