మంచిర్యాల ప్రత్యక్షత:-రాబోయే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సర్ సర్వేని సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల మండల తహశీల్దార్ రఫతుల్లా, మంచిర్యాల అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ గడియారం శ్రీహరి తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం మంచిర్యాల మండలానికి సంబంధించిన బిఎల్ఓ లకు మంచిర్యాల తహశీల్దార్ రఫతుల్లా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రేైనర్ గడియారం శ్రీహరి హాజరై, బిఎల్ఓ లకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రాబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ సర్వేను ఏ విధంగా నిర్వహించాలని బిఎల్ఓ లకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహశీల్దార్ వరలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ కుమార్, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి