హోమ్టాప్ న్యూస్రెండు డీఏల విడుదలపై టీఎన్జీవోల కృతజ్ఞతలు

రెండు డీఏల విడుదలపై టీఎన్జీవోల కృతజ్ఞతలు

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇది ముఖ్యమైన ముందడుగు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, టీజీఈజేఏసీ నాయకత్వానికి జిల్లా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన డీఏలు, పీఆర్సీ అమలు, 51 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన వేతన స్కేళ్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this