
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- పట్టణ నూతన ఎస్సైగా బుధవారం జె.శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహించారు.రామకృష్ణాపూర్ ఎస్సైగా ఉన్న ఎల్.భూమేష్ భూపాలపల్లి కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై జె.శ్రీధర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.