బెల్లంపల్లి ప్రత్యక్షత:-జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం కాంట్రాక్ట్ చౌరస్తా బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం అమ్మఒడి ఎన్జీవో అన్నదాన ప్రాజెక్ట్, టెక్నో డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన దివంగత దంగేటి నాగ దుర్గ ప్రసాద్ జ్ఞాపకార్థం పట్టణానికి చెందిన ఆయన స్నేహితులు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, ఏప్రిల్ 5,2020 నుండి బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ, 372 వారాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు అజ్మీర మోహన్, జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ, అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 372 వారాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మిత్రులు ముడుపు సాండి చారి, తోట సురేందర్, అర్ష ప్రవీణ్, రెడ్డి రాజుల సాయి, , కంది ప్రదీప్, బొజనపెళ్లి రంజిత్, ఆకుల వాసు నాయుడు, దుమ్మని రాకేష్, చింతకింది కిట్టు, కాంపెల్లి శివకుమార్, అమ్మ ఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, కేశ బోయిన రఘు, ఎండి ఖాధీర్, ఎండి యూసఫ్, చందుపట్ల లింగమూర్తి లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి