హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో భవనంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

టీఎన్జీవో భవనంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

0

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మంచిర్యాల టిఎన్జీవో భవనంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి కొరకు ఉద్యోగులందరూ కృషి చేయాలని తెలిపారు. మంచిర్యాల టిఎన్జీవో జిల్లా కమిటీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి,తిరుపతి,రామ్ కుమార్ లు టీఎన్జీవో జిల్లా, మండల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version