-ఎజెండా అంశాలపై సభ్యుల ఏకగ్రీవ తీర్మానం

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా టిఎన్జీవో హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ పైన 29 సెక్షన్ ప్రకారం విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించిన రిపోర్ట్ విషయాలను సమావేశంలో సభ్యులకు చదివి వినిపించారు. హాజరైన 74 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆ అంశాలపై ఆమోదించడంతో ఎజెండా అంశాలపై సమావేశంలో తీర్మానించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, మొండయ్య, హనుమంత రావు,ఇంతియాజ్ అహ్మద్, గోపాల్, శ్రీపతి బాపు రావు,పొన్న మల్లయ్య డిసిఓ మోహన్, మల్లారెడ్డి,ఏవిఆర్డి ప్రసాద్,హౌసింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.