-జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో మంగళవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న‌దని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్,తిరుపతి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు యూసఫ్, రోశయ్య,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి