
నస్పూర్ ప్రత్యక్షత:-టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మహా అన్నదానం నిర్వహించారు. హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎం.డి. హబీబ్ హుస్సేన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ దాతల సహకారంతో నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదానం నిర్వహించిన హబీబ్ హుస్సేన్ దంపతులకు శ్రీ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం అన్నదాత హబీబ్ హుస్సేన్ దంపతులను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె. రాము, డీఈ సీహెచ్. రమేష్‌లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు, నాయకులు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

