హోమ్టాప్ న్యూస్టీఎన్జీవో కాలనీలో ఘనంగా గణనాథుని ప్రతిష్ఠ

టీఎన్జీవో కాలనీలో ఘనంగా గణనాథుని ప్రతిష్ఠ

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్‌లో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక బంకమట్టి మహాగణపతిని వైభవంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బంకమట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. బంకమట్టి విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేసినా నీటికి పెద్దగా హాని కలగదని తెలిపారు.ప్రకృతి మిత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, పూజా కార్యక్రమాల్లో స్టీల్‌ పాత్రలు, ఆకుదొప్పలు వంటి పర్యావరణహిత వస్తువులను వినియోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి, సునీత, లక్ష్మీ రాజయ్య, మల్లికార్జున్, తిరుపతి, ఎన్.సత్యనారాయణతో పాటు కాలనీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో గణపతి హోమం

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోకకల్యాణార్థం గణపతి...

గణేష్ నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ గణేష్ నగర్‌లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో...

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు టీఎన్జీవో శుభాకాంక్షలు

మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో...

అల్ఫోర్స్‌లో ట్రాఫిక్ అవగాహన

మంచిర్యాల ప్రత్యక్షత:-పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం...

More like this