హోమ్ టాప్ న్యూస్ జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

0
9

-కస్తూర్బా పాఠశాలలో అవగాహన కల్పించిన సర్పంచ్

భీమారం ప్రత్యక్షత:-జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా భీమారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమారం గ్రామ సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి పున్నం చంద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, నులిపురుగుల కారణంగా పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. వాటి నివారణ కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం అందించే నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు చిన్నగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం పాఠశాలలోని విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసి వేయించారు. కార్యక్రమం ముగింపులో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి పున్నం చంద్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏసు, కోమలి నాగరాజు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని జాతీయ నులిపురుగుల దినోత్సవం విజయవంతం చేశారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి