
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్.మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలను చేపట్టి సంబంధిత రికార్డులు, పరిపాలనా వ్యవహారాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన పౌర సేవల అందజేతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా కృషి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.పురపాలక సంఘ పరిధిలోని అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

