
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ఇటీవల విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డుకు చెందిన కలువల సుకన్య ను, ఆమె తల్లిదండ్రులు ఆదివారం వార్డు ప్రజలు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివారం సుకన్య నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వార్డ్ 13వ వార్డు కౌన్సిలర్ జక్కినబోయిన మంజుల – కుమార్(బిఆర్ఎస్) ఆధ్వర్యంలో వార్డు ప్రజలు, స్థానిక నాయకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ మంజుల – కుమార్ మాట్లాడుతూ, సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సుకన్య పట్టుదలతో చదివి, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం రాంనగర్ ప్రాంతానికి, జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. ఆమె సాధించిన విజయం యువతకు ముఖ్యంగా విద్యార్థినీలకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మాజీ సర్పంచ్ జాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆసాల రాజన్న, ప్రభాకర్, కంది మహేందర్, పినుమల్ల శివప్రసాద్, మహిళా నాయకురాలు మిట్టపల్లి మరియమ్మ, రాచర్ల రోజా, కలువల లక్ష్మి, పద్మ, శ్రీదేవి లు పాల్గొన్నారు.