మంచిర్యాల ప్రత్యక్షత:-రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో నిరంతరం పనిచేయాలి, అలాగే విద్యార్థుల తో అభ్యాసన సామర్ధ్యాలను పెంచాలని సూచించారు.2025-26 పదవ తరగతి లోని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా బావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు భట్టారి వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి ఒడిగె కృష్ణ , జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చీపెల్లి బాపు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ ,మహాలక్ష్మి,మన్మోహన్, శ్రీరామ్,ఫైనాన్స్ సెక్రటరీ సుమన్, మండల అధ్యక్షులు మల్లేష్,ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి