-కేంద్ర సంఘం అధ్యక్షులను సన్మానించిన: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ తో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అయిన సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ప్రతి ఉద్యోగికి 17 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారితో చర్చించి రావలసిన హెచ్ఆర్ఏ అతి త్వరగ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ సానుకూలంగా స్పందిస్తూ అతి తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి 17 శాతం హెచ్ఆర్ఏ ఇప్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా టిఎన్జీవో సభ్యులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు రాంకుమార్,తిరుపతి,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
