-టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ను కలిసిన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి:గడియారం శ్రీహరి, రామ్మోహన్

మంచిర్యాల ప్రత్యక్షత :-జగిత్యాల జిల్లాలోని పురాతనమైన కోటిలింగాల క్షేత్ర దైవదర్శనానికి విచ్చేసిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు,తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి గడియారం శ్రీహరి, రామ్మోహన్ లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్షెట్టిపేట టీఎన్జీవో అధ్యక్షుడు ఇటీవల అకస్మాతంగా మరణించిన చంద్రమౌళి కి రావలసిన బకాయిలను వీలైనంత త్వరగా అందచేయాలని ఆయనను కోరారు. ఉద్యోగుల డిమాండ్ల చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లులు డిఏలు, పిఆర్సి లపై ప్రభుత్వ నాయకులతో మాట్లాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంచిర్యాల జిల్లా ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో నాయకులు ఆయనను కోరారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి