మంచిర్యాల ప్రత్యక్షత:- టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులు మారం జగదీశ్వర్ మంచిర్యాల జిల్లా విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా శాలువతో సన్మానించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు.మారం జగదీశ్వర్ కేంద్ర సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సాధించడంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ముందు వరుసలో ఉంటుందని తొందరలోనే ముఖ్యమంత్రి తో సమస్యలపై చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్ జిల్లా టీఎన్జీవో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి