-గడియారం శ్రీహరి ని సన్మానించిన టీఎన్జీవో నాయకులు

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులు జిల్లా టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి పాల్గొన్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, విశిష్ట అతిథులుగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇరిగేషన్ శాఖలోని 50 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వ నమోదు చేసుకొని జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి చేతుల మీదుగా నమోదు పత్రాలను అందుకున్నారు. అనంతరం టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు శివ ప్రసాద్ టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి కి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని శాఖల నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ రెండు రోజులలో సభ్యత్వ నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు, టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి