-తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తాం: ఎస్సై శ్రీధర్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై శ్రీధర్ హెచ్చరించారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో రౌడీషీటర్లలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. రౌడీషీటర్ల నేరచరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం తెలుసుకున్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో ఉండాలని వివాదాలు, బెదిరింపులు,చట్ట వ్యతిరేక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.సమాజంలో సత్ప్రవర్తన కలిగిన వారి పైన రౌడీ షీట్ తొలగిస్తామని ఎస్సై తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి