
మంచిర్యాల ప్రత్యక్షత:- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ వేతన సవరణ, కరువు భత్యం, బకాయిల చెల్లింపులతో పాటు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సమర్థవంతమైన ఈహెచ్ఎస్ విధానం తీసుకురావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్‌కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, తిరుపతి, రామ్‌కుమార్, సత్యనారాయణ, నరేందర్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

