-ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముజీబ్ సేవలు ప్రశంసనీయం: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు ముజీబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు సంఘానికి ఎంతో బలాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు. ఇలాంటి జన్మదినోత్సవాలను మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలపై అదే చిత్తశుద్ధితో పోరాడే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, శివప్రసాద్, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్‌తో పాటు జిల్లా, యూనిట్ కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

